21 February 2017 - 21 ఫిబ్రవరి 2017
మాతృ భాషా దినోత్సవం
______________________
______________________
ప్రభుత్వ పాలన శాస్త్రం
అధ్యాయము 1. ప్రభుత్వ పాలన శాస్త్రం - స్వరూపం - పరిధి
మానవుని జీవితమును క్రమబద్ధం చేయగల సమాజములో ఒక బలిష్టమైన సామూహిక శక్తిగా ప్రభుత్వాన్ని గుర్తించవచ్చు. ప్రభుత్వములో రాజనీతి నిర్ణయములు, పాలన నిర్ణయములు అని రెండు తరగతుల నిర్ణయాలను ప్రజా స్వామ్య ప్రభుత్వ పధ్దతిలో మనము చూడవచ్చు. రాజనీతి నిర్ణయములు భారత దేశములో పార్లమెంటులో తీసుకుంటారు. బడ్జెటును మనం రాజనీతి నిర్ణయముగా చెప్పవచ్చు. బడ్జెటులో ప్రభుత్వ కార్యక్రమాలు ఇవ్వబడి, పార్లమెంటు ఆమోదం పొందుతాయి. ఈ కార్క్యక్రమాలను, నీతులను అమలు పరిచే భాద్యత పాలన విభాగానిది. పాలన విభాగం పనిలో రాజకీయాలకు తావులేదు. పార్లమెంటు చర్చలలో జోక్యం ఉంటుంది. పాలన విభాగం పనిలో రాజకీయాలకు చోటు లేదు. ఉడ్రో విల్సన్ ఈ విషయాన్ని 1887 లో ఒక వ్యాసములో స్పష్ట పరిచారు. తదుపరి అనేక వ్యక్తుల కృషి ఫలితముగా పాలన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా అవతరించింది.
ఫ్రెడరిక్ టేలర్ ప్రతిపాదించిన శాస్త్రీయ నిర్వహణ పద్ధతి పాలన శాస్త్రంలో కూడ చోటు చేసుకుంది. ప్రభుత్వ పాలన సమర్ధవంతముగాను, పొదుపు లేదా ఉత్పాదకత తోను కలిసి ఉండాలని పాలన శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు.
ప్రభుత్వ పాలన శాస్త్రం - పరిచయం
* ప్రభుత్వ పాలన ఒక ప్రధానమైన సామాజిక శక్తి.
* మన వేద వేదాంగములు, పురాణములు, రామాయణ భారతములు రాజనీతిని, పాలన సిద్ధాంతములను కలిగి ఉన్నాయి.
* కౌటిల్యుని 'అర్ధ శా స్త్రము' రాజుకి సహకరించ వలసిన ప్రభుత్వ ఉద్యోగులను, వారి భాద్యతలను వివరించింది.
* నవీన కాలం లో 1887 లో ఉడ్రో విల్సన్ ఒక వ్యాసములో రాజ నీతి శాస్త్రం, ప్రభుత్వ పాలన శాస్త్రం మధ్య వ్యత్యాసమును విశదీకరించారు.
ప్రభుత్వ పాలన అంటే ఏమిటి?
రాజ నీతి శాస్త్రం, ప్రభుత్వ పాలన శాస్త్రం మధ్య వ్యత్యాసము
* "శాసనానికి కార్యరూపం కల్పించే కార్యాన్ని పాలన అంటారు." హార్వీ వాకర్
* "అర్హత గల అధికారం ప్రకటించిన ప్రభుత్వ విధానాన్ని, వాని ఉద్దేశ సాఫల్యం కోసం అమలు పరచడాన్నే ప్రభుత్వ పాలన అంటారు." యల్. డి. వైట్
పాలన (అడ్మినిస్ట్రేషన్) అంటే ఏమిటి?
"ఒక లక్ష్య సాధన కోసం వ్యక్తులను, వస్తువులను వ్యవస్థీకరించి ఉపయోగించడమే పాలన." జేమ్స్ మాక్ క్యాని
"కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి మానవ, వాస్తు వనరులను నిర్దేశించడమే పాలన." ఫిఫ్నర్
పై నిర్వచనములనుండి మనము ప్రభుత్వ పాలనను ఈ వాక్యంతో స్పష్టము చేయవచ్చు.
' ప్రభుత్వ విధాన సాధన కోసం వ్యక్తులను, వస్తువులను వ్యవస్థీకరించి, నిర్దేశించి, ఉపయోగించడమే ప్రభుత్వ పాలన." - ప్రొఫెసర్ నారాయణ రావు
ప్రభుత్వ పాలన పరిధి
రెండు ఆలోచనలు ఉన్నాయి.
1. నిర్వహణ దృక్పథం 2. అభిన్న దృక్పథం
నిర్వహణ దృక్పథం
* నిర్వహణ దృక్పథం అభ్యాసం విషయంలో ప్రభుత్వ పాలన పరిధిని నిర్వహణ విధులకు పరిమితం చేస్తుంది.
* అధీనులను నియంత్రణ చేసి, పనులు జరిపించడానికి శిల్ప ప్రక్రియలు ఉన్నాయి.
నిర్వహణ దృక్పథం - అయిదు ప్రధాన భాగాలు
1. సాధారణ పాలన
2. వ్యవస్థీకరణ
3. ఉద్యోగి బృందం
4. అవసరమైన వస్తువులు సరఫరా, పనిచేసే ప్రదేశం, ఉపకరణాలను సమకూర్చడం.
5. అవసరమైన ద్రవ్య నిధుల సేకరణ, కేటాయింపు
అభిన్న దృక్పథం
ప్రభుత్వ కలాపాలు నాలుగు భాగాలుగా చెప్పవచ్చు.
నిర్వహణ, సాంకేతిక పని, గుమస్తా పని, శారీరక శ్రమ. ఈ నాలుగు భాగాలు ప్రభుత్వ పాలన పరిధి లోకి వస్తాయి.
ప్రభుత్వ పాలన శాస్త్రం ఈ నాలుగు భాగాలను కలిగి ఉండాలి,
ప్రభుత్వ పాలన శాస్త్రం - ప్రధాన అంశాలు
ఒకటి పాలన సిద్ధాతం. రెండు అనువర్తిత పాలన
పాలన సిద్ధాతంలో పాలనాధికారులు విధులు, ఆ విధులను నిర్వర్తించడానికి ఉపయోగించ వలసిన పద్ధతులు వివరించబడతాయి.
అనువర్తిత పాలన
పాలన చేయవలసిన రంగాలను ఈ శీర్షిక క్రింద వివరిస్తారు.
వాకర్ 10 రంగాలను సూచించారు.
1. రాజకీయ నాయకులకు సహాయం.
2. శాసన నిర్మాణ విధులు
3. విత్త పాలన
4. దేశ రక్షణ
5. విద్య
6. సామాజిక విధులు
7. ఆర్ధిక రంగం (వ్యవసాయం, వాస్తు ఉత్పత్తి, సేవలు)
8. విదేశీ దౌత్య వ్యవహారములు
9. ఇతర దేశములలో సమస్యలు
10. స్థానిక సంస్థలు
Updated on 2018 - 27 జనవరి
21 ఫిబ్రవరి 2017
Good sir ....
ReplyDelete
ReplyDeletepublic adminstration good subject les
sons
రాజకీయ పాలనా ద్విభాగత్వ దృక్పధం సంబందాలలోని వివిధ సమస్యలు విమర్శనాత్మకంగా చర్చింపుము?
ReplyDeleteI need answer sir in telugu
Techniques of Value Analysis and Engineering by L.D. Miles, Book Information, Review and Summary
ReplyDelete