Saturday, January 7, 2012

ఫిట్టర్ - వృత్తి జ్ఞానము - వృత్తి ప్రాముఖ్యత

ఒక యంత్రము లేక ఒక వటువు యొక్క భాగములను వాటి సరి అయిన స్థానములలో పొందికగా అమర్చుటను ఫిట్టింగ్ అంటారు. కర్మాగారములలో అట్టి ఫిట్టింగ్ పనులను చేయు సాంకేతిక నిపునలను ఫిత్తర్స్ అను పేరుతొ గుర్తిస్తారు.
 
పైప్ ఫిట్టర్, అసెంబ్లీ ఫిట్టర్, బెంచ్ ఫిట్టర్ అను భేదములను మనము గమనించ వచ్చు.
రసాయన కర్మాగారములలో ద్రవ మరియు వాయు స్థితి రసాయనములు పైపుల ద్వారా ప్రవహించడానికి అనేక మలుపులు ఎత్తు పల్లములతో కూడిన పైప్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థను అమర్చే పనిని పైపు ఫిట్టర్లు చేస్తారు.  మెషిన్ భాగములను అమర్చే పని చేసే వారిని అసెంబ్లీ ఫిట్టర్ అని వ్యవహరిస్తారు. లోహపు బద్దలు మరియు లోహపు రేకులను కోసి, బెంచ్  వైస్లో బిగించి అవసరమైన చోట్ల ఫైలింగ్ చేసి కావలసిన వస్తువును తయారు చేసే ఫిట్టర్లను  బెంచ్ ఫిట్టర్ అని పిలుస్తారు.

ఫిట్టిన్గ్లో సాధారణముగా చేసే పనులు

౧. ఫైలింగ్
౨. ఇనుప రంపముతో లోహ కర్రలను, బద్దలను, రేకులను కోయుట.
౩. లోహపు ముక్కలపై లేదా లోహపు యంత్ర విడిభాగములపై రంధ్రములు కోయుట.
౪. రంధ్రములను  రీమింగ్ చేయుట. ఖచ్చితమైన కొలతలకు రంధ్రములను తయారు చేయుట.
౫. మరలను కోయుట

No comments:

Post a Comment